Skip to main content

భోగి పండుగ పరమార్ధం---పిల్లల కు ప్రత్యేకత

భోగి- సంక్రాంతి- కనుమ
ముగ్గురు హీరోల సినిమా టైటిల్ లా వుంది కదూ!
అవును- ఇది పెద్ద పండుగ

భోగి-  భగ భగ మండే  చలి మంటలు అందరూ సామూహికంగా, సమైక్యం భావం
          తొ పాత సామాగ్రిని, ధనుర్మాసం లో  రంగవల్లు లలో  వుంచిన 'గొబ్బెమ్మ' లతో చేసిన
          పిడకలు తో పాటు స్వార్దాన్ని, లోభాన్ని మంటల్లో మండించే పండుగ ... "భోగి"

భోగి రోజు ముఖ్యంగా ఆడపడుచులు పెట్టె 'బొమ్మల కొలువు' గ్రామీణ ప్రాంతాల ఆచార వ్యవహారాల సమాహార ప్రత్రిరూపం!

పులగం(వేయించిన పెసలు, బియ్యం)-  గోంగూర (గోగాకు/పుంటి కూర)-  నెయ్యి( నేయి/మేరుగు)
కలయిక -- మధురమైన "బోగీ వంట" ప్రత్యేకం !!

ఇక మన బుడ్డి డార్లింగ్స్ కి "భోగి పండ్లు" పోయటం...

రేగి పండ్లు ( ఆర్కపలం/ బదరీ ఫలం), అక్షింతలు, బంతి, చేమంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు
తో చేసిన " భోగిపండ్లు"  పిల్లల తలపై పొస్తూ  పెద్దలందరూ అశ్విరదిస్తారు.

పిల్లల్ని నరనారాయణుల గా భావిస్తూ చేసే ఈ  వేడుక  --

"నరనారాయణులు"  మహాడేవుడి ప్రన్నం కోసం బదరీ వనం లో తపస్సు ఆచరించగా దేవతలంతా "బదరీ పలాలతో"  అభిషేకించారు... అప్పటి నుంచే ఈ సంప్రదాయం అని నానుడి...

పిల్లలకు ఈ 'భోగిపండ్లు' తో దీవించటం వలన శ్రీ మహా విష్ణువు ఆశీస్సులతో పాటు చెడు దృష్టి తొలిగి ఆరోగ్య, ఐశ్వర్యములతో , "జ్ఞాన సంపన్న" లౌతారని ప్రగాఢ విశ్వాసం !!!

పెద్దలు, తల్లిదండ్రులు, చుట్టుప్రక్కల వాళ్ళ తో పాటు మన ఆశీస్సులు...





Comments